వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా స్మగ్లర్‌ కొత్త పోకడ, మిక్సీలో బంగారం మిక్స్‌ చేసేసి...

శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం మిక్సీ లోపలి భాగంలో ఉంచి స్మగ్లింగ్‌ చేస్తున్న 1.29 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం మిక్సీ లోపలి భాగంలో ఉంచి స్మగ్లింగ్‌ చేస్తున్న 1.29 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు.

అబుదాబి నుంచి వస్తున్న నగర మహిళ తనతో పాటు మిక్సర్‌ గ్రైండర్‌ను తీసుకొచ్చింది. ఈమె బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు విమానా శ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

gold-in-mixer

బ్యాగేజ్‌తో పాటు గ్రైండర్‌ను కూడా తనిఖీ చేశారు. మిక్సీ మోటర్‌ కింది భాగంలో ఉండే జిగ్‌ అనే ఉపకరణాన్ని తొలగించి, ఆ స్థానంలో బంగారం పెట్టి, పైన మెటల్‌ పూత పూసినట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని మహిళను మరింత లోతుగా విచారిస్తున్నారు.

13 డ్రోన్‌ కెమెరాలు స్వాధీనం...

శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు గురువారం 13 డ్రోన్‌ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో వచ్చిన ఇద్దరు హైదరాబాదీలు తమ వెంట భారీ టీవీతో పాటు 2 బ్యాగుల్లో తొమ్మిది చిన్న, 4 పెద్ద డ్రోన్‌ కెమెరాలను తీసుకొచ్చారు.

వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు వారి బ్యాగులు తనిఖీ చేశారు. వీటిల్లో డ్రోన్‌ కెమెరాలు బయటపడ్డాయి. వీటిని విదేశాల నుంచి తెచ్చుకోవాలన్నా, వినియోగించాలన్నా కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరి. అనుమతులు లేకుండా తీసుకువస్తున్న నేపథ్యంలో కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Directorate of Revenue Intelligence (DRI) sleuths have arrested a woman passenger who arrived from Abu Dhabhi at the RGI Airport in Shamshabad when she was trying to smuggle out 1.29 kilo gold by concealing it inside a mixer. In another case, Customs sleuths arrested two smugglers at the RGI Airport while they were trying to smuggle in 13 drone cameras from Bangkok. DRI sleuths intercepted the accused after she arrived at RGI Airport in Etihad flight (EY-274) from Abu Dhabhi during the wee hours of Thursday. The revenue intelligence sleuths found suspicious material inside the Preethi mixer' the offender was carrying in her baggage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X