రైల్వే ట్రాక్ పై తల పెట్టి ట్రాఫిక్ ఎస్ఐ ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమేనా?
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణ ఆత్మహత్యకు చేసుకున్నారు. మల్కాజిగిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్‌పై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో అతని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడివున్నాయి.
గురువారం ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడస్తూ వెళ్లిన స్థానికులు చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలను చూసి ఉలిక్కిపడ్డారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

మృతదేహం వద్ద దొరికిన ఆధారాలతో మృతుడు ట్రాఫిక్ ఎస్సై రమణగా పోలీసులు గుర్తించారు. 2020 ఎస్సై బ్యాచ్ కు చెందిన రమణ.. బంజారాహిల్స్ లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, రమణ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనేది తెలియరాలేదు.
ప్రేమ వైఫల్యం కారణంగానే రమణ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.
కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
ఉరివేసుకొని ఇంజినీరింగ్ విద్యార్థినిర్థి ఆత్మహత్య చేసుకొం ది. ఈ విషాద ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషస్టే న్ పరిధిలో ఉన్న మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్‌లో చోటు చేసుకుంది.
మూడో సంవత్సరం సీఎస్ఈ చదువుతున్న శ్రావణి(20) అనే
విద్యార్థినిర్థి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లోని తన గది పైన ఉండే ఖాళీ రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.
మధ్యా హ్నం భోజనం చేయడానికి ఎంతకీ కిందకి రాకపోవడంతో తోటి
విద్యార్థినుర్థిలు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు విగత జీవిగా వేలాడుతున్న శ్రావణిని గమనించారు. వెంటనే విద్యార్థినుర్థిను పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలాస్థ న్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిర్థి మృతిపట్ల విద్యార్థి సంఘాలు పలు
అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications