హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను కోవర్టునా? వాళ్లా? : త్వరలో పార్టీ పదవులకు గుడ్‌బై, రేవంత్ రెడ్డిపై పరోక్షంగా జగ్గారెడ్డి విమర్శలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పార్టీని ఇప్పుడే వీడనంటూ ప్రకటించిన కొద్ది గంటలకే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని వ్యాఖ్యానించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను కాంగ్రెస్‌కు దూరం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జగ్గారెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు.

Recommended Video

Jagga Reddy : మోదీ, యోగి,కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవాలి | Oneindia Telugu
కాంగ్రెస్ పార్టీని వీడాలని లేకున్నా.. రాజీనామా చేస్తానంటూ జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీని వీడాలని లేకున్నా.. రాజీనామా చేస్తానంటూ జగ్గారెడ్డి

తనకు జీవితంలో కాంగ్రెస్ పార్టీని వీడాలని లేకుండేనని.. కానీ తాజా పరిస్థితులు తనను అటువైపుగా ఆలోచన చేసే విధంగా ఉన్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను తన పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దయచేసి తనను ఎవరూ కలవొద్దనిన్నారు జగ్గారెడ్డి. తన వల్ల పార్టీకి, వ్యక్తిగత రాజకీయ జీవితానికి నష్టమైందనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలంతా రాజకీయంగా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు చాలా ఇష్టమని, గౌరవం ఉందని జగ్గారెడ్డి చెప్పారు.

అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా..: జగ్గారెడ్డి

అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా..: జగ్గారెడ్డి

తాను స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకున్నా.. సోనియా, రాహుల్ ను గౌరవిస్తూనే ఉంటానని, ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను మీడియా దృష్టిలో పడేందుకు మాట్లాడతానని కొందరు అనడం సరికాదన్నారు. ఏదైనా కోపముంటే నేరుగా చెప్పడం తన వ్యక్తిత్వమని, నిర్మోహమాటంగా మాట్లాడతానని.. అందుకే మీడియా దృష్టి తనపై ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాను. పదవులు ఆశించడం, అందుకోసం ప్రయత్నించడం రాజకీయాల్లో సహజమేనని జగ్గారెడ్డి అన్నారు. అయితే, తన మీద కోవర్టు అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తుననారని, తన వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతోనే తాను పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీని వీడినా.. వేరే పార్టీలో చేరనంటూ జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీని వీడినా.. వేరే పార్టీలో చేరనంటూ జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో బయటకు వెళ్లినా.. వేరే పార్టీలో చేరనని తెలిపారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, వీహెచ్ తోపాటు పలువురు నేతలు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తనకు చెప్పారని, బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారని జగ్గారెడ్డి తెలిపారు. అయితే, వారికి నచ్చజెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ్యాలనే ఉద్దేశంతో రెండు మూడు రోజులు ఆగుతున్నా.. లేకపోతే ఇప్పుడే రాజీనామా చేసేవాడ్ని అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.

అవమానాలు భరించలేకే... రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి పరోక్ష వ్యాఖ్యలు

అవమానాలు భరించలేకే... రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి పరోక్ష వ్యాఖ్యలు

పార్టీలో తనపై కోవర్ట్ ముద్ర వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. పలు విషయాలను పేర్కొంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖరాశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తనపై కొందరు నాయకులు కక్షకట్టారంటూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మూడు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్‌లో సడన్‌గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చని.. అలాగని తనపై నిందలు వేస్తె ఊరుకునేది లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తనపై కోవర్టుగా ముద్రవేస్తున్నారని..ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే పార్టీలో కోవర్ట్ అంటూ.. కొందరు నేతలు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ఉండేవని.. కానీ అప్పుడు నేతల్లో ఉన్న హుందా తనం ఇప్పుడు లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని జగ్గారెడ్డి అన్నారు.

కోవర్టులు వాళ్లా? నేనా?: జగ్గారెడ్డి

కోవర్టులు వాళ్లా? నేనా?: జగ్గారెడ్డి

పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని జగ్గారెడ్డి సూచించారు. రాహుల్ గాంధీ సభ నిర్వహించాలంటూ 2017లో ఇక్కడి నేతలను ఆదేశిస్తే.. సభ పెట్టడానికి పార్టీ నేతలు ముందుకురాని పక్షంలో తాను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించానని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ఆ నాటి నుండే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని.. పార్టీ కోసం కష్టపడిన నేనా కోవర్టుని? అంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. అభ్యర్థులను నిలబెట్టే విషయంలో పార్టీ నేతలు స్పందించని పక్షంలో మెదక్ జిల్లా నుంచి తానే ఒక అబ్యర్దిని బరిలో దించి డబ్బు ఖర్చుచేసి కాంగ్రెస్ పరువు కాపాడానని జగ్గారెడ్డి తెలిపారు. హుజురాబాద్‌లో 40 వేలుగా ఉన్న కాంగ్రెస్ ఓట్లను.. ఇటీవల ఉప ఎన్నికల్లో మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్ళు.. కోవర్టులా? నేను కోవర్టునా? అనే విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానం గ్రహించాలని జగ్గారెడ్డి అన్నారు. ఈ పనికిమాలిన నిందలు భరిస్తూ పార్టీలో ఉండలేకే మనస్సాక్షికి కట్టుబడి స్వతంత్రంగా రాజకీయ జీవితం గడపడం మేలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

English summary
I will leave congress party soon: MLA Jaggareddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X