రేవంత్: రుజువైతే 6నెలల నుండి ఐదేళ్ల వరకు శిక్ష
హైదరాబాద్: లంచం ఇవ్వజూపిన కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. రేవంత్ పైన ఐపీసీ సెక్షన్ 120 బీ, 34తో పాటు అవినీతి నిరోధక చట్టం1988 సెక్షన్ 12 ప్రకారం కేసు నమోదు చేశారు.
నేర పూరిత కుట్రకు పాల్పడిన వారికి ఐపీసీ సెక్షన్ 120 బీ వర్తిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం నేరు రుజువైతే ఆరు నెలల నుండి రెండేళ్లు ఆ పైన, జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయి.
సెక్షన్ 34 ప్రకారం పలువురు వ్యక్తులు ఒకరి ఆదేశానుసారం చేస్తే ఒక్కొక్కరూ వ్యక్తిగతంగా ఆ నేరం చేసినట్లు కేసు పెడతారు. ఈ సెక్షన్ ప్రకారం రేవంత్‌కు సహకరించిన వారి మీద కూడా కేసు నడుస్తుంది. ఈ కేసులో కీలకం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12.

రిమాండ్ రిపోర్టులో..
రేవంత్ రెడ్డికి చెందిన రూ.50 లక్షలతో పాటు రెండు ఐ ఫోన్‌లను సీజ్ చేసినట్లు రిమాండు రిపోర్టులో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు సోనీ కంపెనీకి చెందిన మూడు ఐసీ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రేవంత్ ఉపయోగించిన ఒక నోయికా ఫోన్, సెబాస్టియన్ ఉపయోగించిన ఒక హెచ్‌టీసీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు కేసులో మూడో నిందితుడు ఉదయ్ సిన్హా ఉబయోగించిన నోకిటా ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి నుండి వీడియో రికార్డింగులు, కాల్ డేటాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications