ఇర్రిగేషన్ ఏఈ అదృశ్యం: భార్య కన్నీరుమున్నీరు
మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, ఆందోల్ మండలాల ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యం కలకలం రేపుతోంది. మిషన్ కాకతీయ పనుల ఒత్తిడి వల్లే పరమేశ్వర్ కనిపించకుండా పోయాడని అతని భార్య సుజాత ఆరోపించారు.
గురువారం సాయంత్రం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి వెళ్తున్నట్లు చెప్పిన పరమేశ్వర్ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో భార్య సుజాత ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరమేశ్వర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలావుంటే, మెదక్ జిల్లాలోని హవేలిఘన్‌పూర్‌లో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్న వీఆర్వోపై ఇసుక మాఫియా దాడికి తెగబడింది. దీంతో వీఆర్వో తీవ్రంగా గాయపడ్డారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications