దిల్ రాజుపై ఐటీ కొరడా- మెరుపుదాడి: మెగా దెబ్బ
Dil Raju: ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో గల ఆయన నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి.
ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత ఆయనే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి. మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. ఈ నెల 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి.

ఈ రెండు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోలేకపోయింది. డిజాస్టర్ అనే ముద్రను వేయించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. ఈ సంక్రాంతి రేసులో హీరోగా నిలిచిందనేది ఫిల్మ్ నగర్ టాక్.
ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో హైదరాబాద్‌లో పలుచోట్ల ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications