ఝాన్సీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్: భర్తపై ఫిర్యాదు చేస్తూ కెసిఆర్‌కు లేఖ
హైదరాబాద్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో బిటెక్ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె మృతిపై పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల క్రితం మరణించిన ఝాన్సీ తన తల్లిపై, భర్తపై ఫిర్యాదు చేస్తూ ఆమె రాసిన సూసైడ్ లేఖ ఆలస్యంగా వెలుగు చూసింది.
తనను వ్యభిచారంలోకి దించేందుకు భర్తతో పాటు తల్లి కూడా ప్రయత్నించారని ఆమె ఆ లేఖలో ఆరోపించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, డిజిపికి, జిల్లా ఎస్పీకి, నకిరేకల్ పోలీసులకు తాను చనిపోయే ముందు ఆ సూసైడ్ లేఖను పంపించిదంి. దీంతో ఝాన్సీ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, ఝాన్సీ ఆత్మహత్య కేసులో తల్లి పద్మ, భర్త విజేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 306, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేక ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని తల్లి పద్మ పోలీసుల విచారణలో చెప్పింది.
ఝాన్సీని సొంత మేనత్త కొడుక్కే ఇచ్చి పెళ్లి చేశామని తల్లి పద్మ తెలిపింది. కాలేజీలో సందీప్ అనే యువకుడిని ఝాన్సీ ప్రేమించిందని తల్లి పద్మ చెప్పారు. ఈనెల 24న ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని సీఐకి తమ్ముడు తెలిపాడు. ఝాన్సీ మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications