ప్రిన్సిపళ్ల మీటింగ్‌లో కడియం
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు పున:వైభవం తీసుకొచ్చే విధంగా ప్రిన్సిపాళ్లు పనిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.
హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు పున:వైభవం తీసుకొచ్చే విధంగా ప్రిన్సిపాళ్లు పనిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు, వసతులు కల్పించినా ప్రిన్సిపాళ్లు పట్టించుకుంటేనే వాటి ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్ల వర్క్ షాప్ ను మంత్రి కడియం శ్రీహరి సర్వశిక్ష అభియాన్ హాల్ లో ప్రారంభించారు. విద్యావిధానాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, ఆయన ఆలోచనలకనుగుణంగా పనిచెయ్యాలని కోరారు.












Click it and Unblock the Notifications