అసెంబ్లీ రాజకీయ వేదిక కాకూడదు: కెసిఆర్
అసెంబ్లీ రాజకీయ వేదిక కాకూడదని.. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు పరిష్కరించేలా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం ఆయన ప్రగతిభవన్ లో అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీ వేదిక కావాలని పేర్కొన్నారు ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రులు, అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సభ ద్వారా ప్రజలకు వివరించాలని తెలిపారు.












Click it and Unblock the Notifications