ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ..
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై చర్చించడానికి శనివారం సాయంత్రం 4.40గం.లకు ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయిట్ మెంట్ ఫిక్స్ అయింది.
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోడీతో చర్చించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై శనివారం నాడు ఉదయం పలువురు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు కేసీఆర్. అనంతరం ప్రధాని మోడీతో సాయంత్రం 4.40గం.లకు భేటీ అయ్యారు కేసీఆర్.
పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులపై మోడీ చర్చిస్తున్నారు కేసీఆర్. రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతుండడంతో.. రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సిందిగా కోరే అవకాశం ఉంది. మోడీ దగ్గర ప్రస్తావించడం కోసం ఇప్పటికే ఐదు అంశాలను కేసీఆర్ నివేదికల రూపంలో సిద్దం చేసి పెట్టుకున్నారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి రూ.3250కోట్ల నష్టం వాటిల్లుతుండడంతో.. ఆ లెక్కలను నివేదిక ద్వారా మోడీకి అందజేయనున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు పలు చిన్న మధ్య తరహా వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అలాగే వస్తుసేవలు, వాణిజ్యపన్నుల ఆదాయం, రవాణాశాఖ, ఎక్సైజ్ ఆదాయం చాలా వరకు తగ్గిపోయిన సంగతిని మోడీతో ప్రస్తావించనున్నారు.
ప్రధాని మోడీతో భేటీలో భాగంగా.. సీఎం కేసీఆర్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు భేటీలో పాల్గొనున్నారు.
ఈ అంశంపై ఇతర రాష్ట్రాల సీఎంలతో కూడా భేటీ కావాల్సిందిగా ప్రధానికి సీఎం కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications