ఆంధ్రా వాళ్లే నన్ను పొగిడారు, నన్ను ఎవడో అన్నాడు: రేవంత్‌పై కేసీఆర్
తెలంగాణలో చేపల పరిశ్రమను అభివృద్ధి పరిస్తే ఆంధ్రా మిత్రులే తనను ప్రశంసించారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. ప్రగతి భవన్లో బీసీలతో జనహిత కార్యక్రమం ప్రారంభమైంది.
హైదరాబాద్: తెలంగాణలో చేపల పరిశ్రమను అభివృద్ధి పరిస్తే ఆంధ్రా మిత్రులే తనను ప్రశంసించారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. ప్రగతి భవన్లో బీసీలతో జనహిత కార్యక్రమం ప్రారంభమైంది.
ఇందులో భాగంగా కేసీఆర్.. బీసీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. బడ్జెట్లో బీసీ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించామన్నారు.
స్వరాష్ట్రంలో బాగుపడతామనే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్‌ల కంటే తెలంగాణలో ఆదాయం 21 శాతం పెరుగుదల ఉందన్నారు. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కంటే తెలంగాణ బడ్జెట్ ఎక్కువ అన్నారు.

పేదలను శ్రీమంతులను చేయాలనేదే తన కోరిక అన్నారు. ఎవరూ లంచం ఇవ్వవద్దని, పనులు జరుగుతాయని చెప్పారు. రాదనుకున్న తెలంగాణ వచ్చిందని, అనుకుంటే కచ్చితంగా చేయవచ్చునని చెప్పారు.
ఇప్పటి వరకు రాజకీయంగా ప్రాధాన్యం లభించని కులాలకు ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రతి కులం, ప్రతి ఒక్కరు చిరునవ్వులు చిందించాలన్నారు. అదే తన కోరిక అన్నారు.
సంపద సృష్టించే శక్తి యాదవులకు, ముదిరాజ్‌లకు ఉందని చెప్పారు. గల్ఫ్ దేశాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఆరెకటికలు ఎదగాలన్నారు. బోయ వాల్మీకలను ఎస్టీల్లో చేర్చుతామని చెప్పారు.
రేవంత్ రెడ్డికి కౌంటర్
ప్రగతి భవన్‌కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కేసీఆర్ ఇల్లు నిర్మించుకున్నారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై కేసీఆర్ సమావేశంలో మాట్లాడుతూ స్పందించారు.
తనను ఒకడు కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడని చెప్పాడని, సీఎం ఇల్లు అంటే ప్రజలందరిది అని చెప్పారు.
ఆ వెంటనే తనను కలిసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి.. నేను మిమ్మల్ని వదలనని (అభివృద్ధి కోసం), నేను అనుకున్నట్లు మీరు పైకి వచ్చే వరకు వదలనని, ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం తాను మాట్లాడటం లేదన్నారు. మంచి చేస్తే ప్రజలే గెలిపిస్తారని, అది నాకు సిద్దిపేటలో మంచి అనుభవం అన్నారు.
పనికి మాలిన వారిని ఎందుకు రానిచ్చారు
ఓ సమయంలో సమావేశానికి వచ్చిన కొందరు ఏదో మాట్లాడగా.. కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన వారిని ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. మీరా కులాన్ని రక్షించేదన్నారు. పిచ్చి పంచాయతీలు పెట్టుకొని దమాక్ కరాబ్ చేసుకోవద్దన్నారు.












Click it and Unblock the Notifications