యూపీలో బీజేపీ గెలవకుంటే కష్టమయ్యేది: కేసీఆర్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ ముఖ్య నేతలతో శనివారం ఆయన సమా
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ ముఖ్య నేతలతో శనివారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం వల్ల తెలంగాణలో తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అంశాల వారీగా మద్దతిస్తున్నామని చెప్పినట్లు తెలిసింది.

అంతేగాక, కీలక రాష్ట్రాల్లో గెలుపొందడం బీజేపీకి కచ్చితంగా పెద్ద విజయమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయుంటే ఆర్థిక సంస్కరణల్లో దేశం వెనకబడేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
అంతేగాక, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఈ విజయంతో దేశాభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి 310 సీట్లకు పైగా సీట్లను సాధించింది. ఉత్తరాఖండ్‌లోనూ మేజిక్ ఫిగర్‌ను దాటేసి ప్రభుత్వాన్నిఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సాగుతోంది. ఈ రెండు ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్‌ను దక్కించుకోలేదు. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ అందించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications