సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు చాలా సీరియస్‌గా ఉందని అన్నారు. ఈ మేరకు జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన గద్వాల గర్జన బహిరంగ సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరబోనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆనాడు అన్నారని.. కాంగ్రెస్ లో చేరాల్సి వస్తే రైలు కింద తలపెడతానన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఈనాడు బీఆర్ఎస్ మీటింగ్ గద్వాలలో జరుగుతుంటే సీఎం రేవంత్ వద్ద ఉన్నారని తెలిపారు. కానీ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగులాంబ జిల్లా గద్వాలలో నిర్వహించిన గద్వాల గర్జన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయి.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు చాలా సీరియస్‌గా ఉంది.. అని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని స్పష్టం చేశారు.
అలాగే.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరబోనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆనాడు అన్నారని.. కాంగ్రెస్ లో చేరాల్సివస్తే రైలుకింద తలపెడతానన్నారని.. మరి ఈనాడు బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నారని మండిపడ్డారు. 6 నుంచి 9 మాసాల్లో గద్వాలలో ఉప ఎన్నిక రావడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు గద్వాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ది అని కేటీఆర్ అన్నారు . గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిందని.. జోగులాంబ గద్వాలను జిల్లా కేంద్రంగా చేసిన ఘనత కేసీఆర్ దని తెలిపారు. రైతులకు ఇచ్చే యూరియాను కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. 6 నెలల్లో గద్వాలలో ఉప ఎన్నిక రావడం ఖాయమని.. 50వేల ఓట్ల మెజార్టీతో గులాబీ జెండా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications