గ్రేటర్ మనదే, వలసలు కొనసాగుతాయి: కెటిఆర్, డిక్షనరీలోనే ‘సెటిలర్’ లేదన్న డీఎస్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని టిఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో కేఎం ప్రతాప్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, వీఎన్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని నమ్మి కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. టిఆర్‌ఎస్‌లోకి వలసలు ఇంకా కొనసాగుతాయన్నారు. పార్టీలో చేరిన కేఎం ప్రతాప్, కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదని మండిపడ్డారు. తాము 18 నెలల్లో ఏం చేశామో ప్రజలకు చెప్పగలమని అన్నారు. 60 ఏళ్లలో ఏం చేశారో చెప్పగలరా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. సీఎం కెసిఆర్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంధకారమైపోతుందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌కు గతంలో ఏం చేశారో కాంగ్రెస్, టిడిపి నేతలను నిలదీయండని సూచించారు. ఇక 38లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాలకు చెందిన నిరుపేద ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 51 వేలు ఇస్తున్నామని గుర్తు చేశారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని తెలిపారు. మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోందని, ఇప్పటి వరకు హైదరాబాదులో ఒక్కసారైనా అడుగు పెట్టారా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఆయన నిత్యం విదేశాల్లో తిరుగుతుంటారన్నారు.

గెలుపు టిఆర్ఎస్ పార్టీదే: తలసాని
గ్రేటర్ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌దే గెలుపు అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ టిఆర్‌ఎస్ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు. రాబోవు కాలంలో హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ తప్ప వేరే పార్టీ ఉండదని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వానికి సహకరించాలనే తపన ప్రజల్లో ఉందన్నారు. గత ప్రభుత్వాలను ప్రజలు ఛీదరించుకునే వారని అన్నారు. సంక్షేమ రంగంలో టిఆర్‌ఎస్ దూసుకుపోతుందని చెప్పారు.
సెటిలర్ అనే పదం డిక్షనరీలోనే లేదు: డీఎస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని టిఆర్‌ఎస్ నేత డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ డిక్షనరీలోనే సెటిలర్ అనే పదం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం అపారంగా పెరిగిందన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. సీఎం పర్యవేక్షణలో ఐడీహెచ్ కాలనీ బ్రహ్మండంగా నిర్మించారని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్స్ కట్టించి ఇస్తామని చెప్పారు. ఇక ఐటీ రంగానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో కొన్ని లక్షల ఉద్యోగాల మన పిల్లలకు వస్తాయని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications