విషాదం: పెళ్ళి రద్దుతో పెళ్ళికూతురు ఆత్మహత్య, పెళ్ళిరద్దుకు కారణమైన యువకుడిలా....
వివాహం రద్దై ఇద్దరి మరణానికి దారితీసింది.అయితే ఈ వివాహం రద్దు కావడంతో వివాహం చేసుకోవాల్సిన వారిద్దరూ కూడ ఆత్మకు పాల్పడ్డారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఖమ్మం: వివాహం రద్దై ఇద్దరి మరణానికి దారితీసింది.అయితే ఈ వివాహం రద్దు కావడంతో వివాహం చేసుకోవాల్సిన వారిద్దరూ కూడ ఆత్మకు పాల్పడ్డారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన కంటెపూడి ఉషారాణి సోమవారం నాడు తన ఇంట్లోని బాత్ రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉషారాణి ఆత్మహత్యపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉషారాణికి గత మాసంలో సత్తుపల్లికి చెందిన ఓయువకుడితో వివాహం కుదిరింది. మేలో పెళ్ళి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించాయి.అయితే ఈ వివాహన్ని రద్దైంది. ఈ వివాహం సందర్భంగా పెళ్ళి కొడుకు కుదుర్చుకొన్న సమయంలో యువకుడి ఇచ్చిన లాంఛనాలను తిరిగి తీసుకొని వివాహం రద్దుకు సంబందించి ఒప్పందాలు చేసుకొన్నారు.

ఈ వివాహం రద్దు కావడంతో ఉషారాణి తన ఇంట్లోని బాత్ రూమ్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అయితే ఈ వివాహం రద్దు కావడానికి నరేందర్ అనే యువకుడు కారణమని అనుమానిస్తున్నారు. ఉషారాణి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నరేందర్ ఆమెకు ఫోన్ చేశాడు.ఉషారాణి నరేందర్ పై తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతలకు చెందిన నరేందర్ కంచికచర్ల మండలంలోని చెవిటికల్లులోనే నరేందర్ అమ్మమ్మ ఇంటి వద్ద ఉండేవాడు. ఎంటెక్ పూర్తి చేసి విజయవాడలో నరేందర్ ఉద్యోగం చేస్తున్నాడు.అయితే ఉషారాణి వివాహం రద్దు కావడానికి నరేందర్ కారణమనే ప్రచారం సాగింది.అయితే ఉషారాణి ఆత్మహత్య చేసుకొంది. ఉషారాణి ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిన వెంటనే నరేందర్ కూడ తన అమ్మమ్మ ఇంటి వద్దే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications