హాల్లో దొంగిలించిన పుస్తకాలతో ప్రాక్టీస్, హైకోర్టు లాయర్ అరెస్టు
హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది ఒకరు అరెస్టయ్యారు. అరెస్టైన న్యాయవాది పేరు గంగవేణు అని తెలుస్తోంది. అతను హైకోర్టు హాలులోని న్యాయ పుస్తకాలను దొంగిలించిన కేసులో అరెస్టయ్యాడు. దొంగిలించిన పుస్తకాలతో అతను ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తేలిందని సమాచారం.
హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో న్యాయవాది వేణును చార్మినార్ పోలీసులు సోమవారం నాడు అరెస్టు చేశారు. హైకోర్టు న్యాయవాది పుస్తకాల దొంగతనంలో అరెస్టు కావడం గమనార్హం.

గచ్చిబౌలీలో ఆరుగురు దొంగలు అరెస్ట్
గచ్చిబౌలీలో ఆరుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి రూ.2.56 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. పద్దెనిమిది చోరీ కేసుల్లో ఈ ఆరుగురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రూ.20లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం
అలిపిరి వద్ద సుమారు రూ.20లక్షల ఆభరణాలను సోమవారం టిటిడి భద్రతాధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలు గుంటూరుకు చెందిన గుమ్మడి రాజేశ్, భారతి దంపతులకు చెందినవిగా గుర్తించారు. తిరుమలలో బంధువుల వివాహానికి రాజేశ్, భారతి దంపతులు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications