తెలుగు సిఎంలు ఒత్తిడి: తమిళ ప్రభుత్వంపై ‘ఉత్తరాల ఉద్యమం’(పిక్చర్స్)
హైదరాబాద్: తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు భాష తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు భాషాభిమానులు. మాతృభాషపై అభిమానం ఉండొచ్చని.. అంతమాత్రాన పొరుగురాష్ట్రాల భాషలను చిన్నచూపు చూడొద్దని హితువు పలికారు.
తమిళనాట భాషా స్వాతంత్య్రం కోసం, తెలుగు భాష రద్దుకు నిరసనగా తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమ్యాన్ని గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.
తమిళ భాషను తప్పనిసరి చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని.. కానీ, తమిళ మాధ్యమంలోనే చదవాలనే నిర్ణయం అభ్యంతరకరమన్నారు. తెలుగు విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ పరంగా తమిళనాడుపై ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె నారాయణ మాట్లాడుతూ.. తెలుగు విద్యార్థులకు మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచే తెలుగువారు, తమిళులు కలిసి ఉన్నారని, తెలుగువారు అక్కడికి వలసవెళ్లిన వారు కాదని ఆయన తెలిపారు.

ఉత్తరాల ఉద్యమం
తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు భాష తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు భాషాభిమానులు.

ఉత్తరాల ఉద్యమం
మాతృభాషపై అభిమానం ఉండొచ్చని.. అంతమాత్రాన పొరుగురాష్ట్రాల భాషలను చిన్నచూపు చూడొద్దని హితువు పలికారు.

ఉత్తరాల ఉద్యమం
తమిళనాట భాషా స్వాతంత్య్రం కోసం, తెలుగు భాష రద్దుకు నిరసనగా తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమ్యాన్ని గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.

ఉత్తరాల ఉద్యమం
తమిళ భాషను తప్పనిసరి చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని.. కానీ, తమిళ మాధ్యమంలోనే చదవాలనే నిర్ణయం అభ్యంతరకరమన్నారు.

ఉత్తరాల ఉద్యమం
తెలుగు విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ పరంగా తమిళనాడుపై ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పసిపిల్లలకు అమ్మపాలు తాగే హక్కు ఎలాగో.. పాఠశాలకు వెళ్లే చిన్నారులకు మాతృభాషలో చదువుకునే హక్కుకూడా అలాంటిదేనని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కేవలం మాట్లాడితేనే భాష బతకదని.. రాయడం, చదవడం కూడా తోడైతేనే భాష జీవిస్తుందని చెప్పారు.
తమిళనాడు ప్రభుత్వ అమలు చేస్తున్న విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆవుల మంజులత తెలిపారు. ద్విభాష సూత్రం కాకుండా.. త్రిభాష సూత్రం అమలు చేయాలన్నారు. సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఛేంజ్.ఆర్గ్‌లో సంతకాలు, ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్ రూపంలో ఉద్యమానికి మద్దతు పలకాలని నిర్వాహకులు కోరారు.












Click it and Unblock the Notifications