ఇదీ విషయం: మాల్యా సహా వారి బకాయిల రద్దులో ట్విస్ట్, ఏపీ-టీలలో ఏ కంపెనీ ఎంతంటే..
హైదరాబాద్: ఓ వైపు సామాన్యులు రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఎస్‌బీఐ విజయ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్ల బకాయిలను రూ.7 వేల కోట్లు రద్దు చేసిందనే వార్తలు సంచలనం రేపాయి. అయితే వారి బకాయిలు రద్దు కాలేదు. అందులో ఓ ట్విస్ట్ ఉంది.
ఎస్‌బీఐ ప్రకటన... అసలు ఏమిటి?
భారీగా పేరుకు పోయిన రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. ఈ మేరకు బ్యాలెన్స్ షీట్స్‌లో సర్దుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకులకు భారీగా రుణాలను ఎగొట్టి దేశం వదలి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ఇది లాభించినట్లైంది.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన రూ.1,200 కోట్ల మొండిబకాయిలను వదులుకున్నట్లు ఎస్బీఐ అధికారులు వెల్లడించారు.
అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా) కింద మొండి బకాయిలను సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6వేల కోట్ల వరకు బాకీ పడింది. ఎస్బీఐ స్వాధీనం చేసుకున్న స్థిర ఆస్తుల్లో గోవాలోని మాల్యాకు చెందిన విల్లా కూడా ఉంది.
అయితే దీనిని వేలం వేసేందుకు పలుమార్లు ప్రకటనలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విల్లా కొనుగోలు చేసే వారి కోసం ఎస్బీఐ ఎదురు చూస్తోంది. దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గందరగోళం సృష్టిస్తున్న సమయంలో ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
ఏమిటి ఈ ఆకా?
రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన పద్ధతి అయిన ఆకా అనే పద్ధతిని ఇక్కడ ఎస్బీఐ అవలంభించింది. దీని ప్రకారమం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదలీ చేస్తారు. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించవు. తద్వారా బ్యాంకు పని తీరు మెరుగుపడినట్లవుతుంది.
అయితే అంతమాత్రాన వాటిని మాఫీ చేసినట్లు కాదు. వన్ టైమ్ సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు చూపించినా, వాటిలో ఆకాలో యథాతథంగా ఉంచుతారు. తద్వారా ప్రతి రూపాయి వసూలు అయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతుంటుంది.
ఈ పద్ధతిలోనే 63 మంది డిఫాల్టర్లకు చెందిన మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్లు తెలుస్తోంది. రూ.7,016 విలువ చేసే నిరర్ధక ఆస్తులను ఇలా చేసినట్లు ఎస్బీఐ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల కంపెనీలు ఇవే..
ఎస్బీఐ విజయ్ మాల్యాకు చెందిన రూ.1200 కోట్లు సహా 63 మంది డిఫాల్టర్ల బకాయిలు రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంపెనీలు కూడా ఉన్నాయి.
ఏపీ కంపెనీలు
విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - రూ.93.91 కోట్లు
విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ - రూ.66.57 కోట్లు
కెఆర్ఆర్ ఇన్ ఫ్రా - రూ.86.73 కోట్లు
ఘనశ్యాం దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లరీస్ - రూ.61.72 కోట్లు
తెలంగాణ కంపెనీలు
తోతమ్ ఇన్ ఫ్రా - 93.68 కోట్లు
ఎస్ఎస్‌బీజీ ఇంజినీరింగ్ లిమిటెడ్ - 65.24 కోట్లు
ఈ కంపెనీలతో పాటు కేఎస్ ఆయిల్ (రూ.596 కోట్లు), సూర్య ఫార్మాస్యుటికల్ (రూ.526 కోట్లు), జీఈటీ పవర్ (రూ.400 కోట్లు), సాయి అండ్ ఇన్ఫోసిస్టమ్ (రూ.376 కోట్లు) ఉన్నాయి. 63 ఖాతాలను పూర్తిగా ఆకాలోకి మళ్లించగా. 31 ఖాతాలను పాక్షికంగా మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఆరింటిని మొండి బకాయిలుగా చూపించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications