అనుచరుడి పాడె మోస్తూ కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి.. వీడియో వైరల్
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, మాజీ జడ్పీటీసీ గాదె సత్యం అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం నాడు ఆయన మృతి చెందగా శనివారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సత్యం కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన మృతదేహానికి నివాళులర్పించేందుకు మంత్రి తుమ్మల వచ్చారు. అనుచరుడికి కడసారి వీడ్కోలు పలుకుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో సైతం పాల్గొని వైకుంఠధామం వరకు పాడె మోశారు. మంత్రితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపి.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.













Click it and Unblock the Notifications