ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణీకులకు మోదీ భారీ వరం..!!
ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణీకులకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. విమాన యానశ్రయాల తరహాలో తీర్చి దిద్దిన రైల్వే స్టేషన్లు వినియోగంలోకి తెచ్చారు. ప్రధాని మోదీ దేశ్‌నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో తెలంగాణలో 3 ఏపీలో 1, యూపీలో 19, గుజరాత్ 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 రైల్వేస్టేషన్లను ప్రారంభించారు.
ప్రధాని మోదీ బికనీర్‌లోని కర్ణిమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్‌ను మోదీ సందర్శించారు. మరోవైపు బికనీర్ సమీపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అమృత్ భారత్ స్టేషన్' పథకంలో భాగంగా.. తెలంగాణలోనూ 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ పునరాభివృద్ధి పనులకు రూ. 2,750 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోనే చర్లపల్లి అతిపెద్ద రైల్వే టెర్మినల్. ఇక్కడి నుంచి ఇప్పటికే ట్రైన్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తాజాగా, బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల నిర్మాణాలు సైతం పుర్తై... ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.

కాగా, ఈ రోజు ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ మూడు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. ఈ మూడు స్టేషన్లను ఎయిర్‌పోర్టులను తలపించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. రానున్న 30-40 సంవత్సరాల వరకు ప్రయాణీ కులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ స్టేషన్లను రూపొందించారు. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టేషన్ల ముఖద్వారం, ప్రధాన భవనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఈ స్టేషన్లు అందుబాటులోకి రావటంతో ప్రయాణీకులకు మరింత వెసులు బాటు కలగనుంది.












Click it and Unblock the Notifications