స్నేహితుడిని కోల్పోయా: భూమా మృతిపై మోహన్ బాబు, బాలకృష్ణ
భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతిపై సినీ నటుడు మోహన్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భూమా మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఒక మంచి స్నేహితుడిని, మా కుటుంబం మంచి సన్నిహితుడిని కోల్పోయిందన్నారు.
హైదరాబాద్: భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతిపై సినీ నటుడు మోహన్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భూమా మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఒక మంచి స్నేహితుడిని, మా కుటుంబం మంచి సన్నిహితుడిని కోల్పోయిందన్నారు.
కోయంబత్తూరులో ఉన్న తనను భూమా మరణం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి షిర్డీ శ్రీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలన్నారు.

భూమా మృతిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. భూమా కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. నంద్యాల నియోజకవర్గానికి ఆయన విశిష్ట సేవలు అందించారని, ఆయన మరణం వారికి తీరని లోటు అన్నారు.
భూమా కుటుంబానికి అండగా ఉంటాం
భూమా నాగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు. వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి పరిటాల సునీత స్పందన
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో కర్నూలు జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని మంత్రి పరిటాల సునీత అన్నారు. రాయలసీమలో టిడిపి బలమైన నేతను కోల్పోయిందన్నారు. భూమా కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందన్నారు. అలాగే భూమా మృతి టిడిపికి తీరని లోటు అన్నారు.












Click it and Unblock the Notifications