హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బుర్హానుద్దీన్ అరెస్ట్
హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హత్యాయత్నం కేసులో తప్పించు తిరుగుతున్న బుర్హానుద్దీన్‌ను మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుపై పలు పోలీస్ స్టేషన్లలో 15 కేసులున్నాయి. భూ కబ్జాతోపాటు బెదిరింపులు, మోసాలు, దాడులు వంటి కేసులున్నాయి.
2011లో మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రికి కూడా నిందితుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా పలువురిని మభ్యపెట్టినట్లు గుర్తించారు.
మైనింగ్ ఇప్సిస్తామంటూ కోట్ల రూపాయల మేర మసం చేశాడు. ఆ కేసులో అరెస్టై జైలు పాలయ్యాడు. ఏపీ మాజీ మంత్రి కుమారుడిని హనీట్రాప్ చేసి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంతేగాక, కేసు నుంచి తప్పిస్తానంటూ ఈడీ కేసులో ఓ ఐఏఎస్ అధికారిని కూడా బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు నిందితుడిపై జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. బుర్హానుద్దీన్ పై పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు.
తాజాగా, బుర్హానుద్దీన్ మరో 9 మందితో కలిసి హాకీ స్టిక్స్, ఇనుపరాడ్లు, క్రికెట్ బ్యాట్లతో భయభ్రాంతులకు గురిచేసి ఖాళీ స్థలం కబ్జాకు యత్నించినట్లు మహ్మద్ హఫ్రోజ్ బేగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులోనే మిగితా నేరాలు వెలుగులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications