టిడిపి పరిస్థితికి మోత్కుపల్లి కంటతడి!, దత్తాత్రేయకు రాయలసీమ నేతల బిరుదు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టిడిపి పరిస్థితిని తల్చుకొని మోత్కుపల్లి కంటతడి పెట్టినట్లుగా తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా తెలంగాణలో టిడిపి పరిస్థితి దిగజారిపోతోందనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయమై... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ కంటతడి పెట్టినట్లుగా తెలుస్తోంది.
పలువురు నేతలు వేదికపై ఉండగా... మోత్కుపల్లి మాట్లాడుతూ... ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇలా అయిపోయిందని ఉద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని బతికించుకోవాలని మోత్కుపల్లి సూచించారు. త్వరలోనే ఆలేరు నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ప్రజలను కలుస్తానని చెప్పారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి - టిడిపి గెలుపు ఖాయమని మోత్కుపల్లి సహా ఇతర నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. గ్రేటర్ నుంచి టిడిపి బలోపేతాన్ని తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారని అంటున్నారు.
దత్తాత్రేయకు 'బిసి బంధు' బిరుదు
కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయకు ‘బీసీ బంధు' బిరుదు ప్రదానం చేశారు. రాయలసీమ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దత్తాత్రేయకు ఈ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications