మోడీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్, కేసీఆర్
హైదరాబాద్: డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని శుక్రవారం సాయంత్రం 6.26 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ప్రధాని రాకకు గంట ముందు విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు ఆయన రాగానే పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో కొద్దిసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications