హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. చిల్లర గొవకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం ఆన్‌లైన్ పేమెంట్స్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చిల్లరలేదని మధ్యలోనే బస్సు నుంచి దింపే పరిస్థితి ఇ ఉండకపోవచ్చు.
హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్యాసింజర్లు, కండకర్లకు మధ్య చిల్లర కోసం జరిగే గొడవకు స్వస్థి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రయాణం చేయవచ్చునని టీజీఆర్టీసీ ప్రకటించింది.

ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్ష సిస్టమ్‌లో భాగంగా ఆన్‌లైన్ టికెటింగ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కాగా, ఇప్పటికే జిల్లాలకు వెళ్లే, దూర ప్రయాణాలు చేసే లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ అనుమతిస్తున్నట్లు తెలిసిందే. ఇప్పుడు సిటీ బస్సుల్లోనూ ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే అవకాశం కల్పిస్తుండటంతో సిటీ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications