రెండు కోట్ల ఎకరాల మాగాణం - వ్యవసాయ రంగంలో ఆదర్శం..!!
ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న చోటే, నేడు పండుగలా మారింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్బుత ప్రగతి సాధించింది. దేశం మొత్తం తెలంగాణ రైతు వైపు చూస్తోంది. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ఎదిగింది. సీఎం కేసీఆర్ ఆలోచనలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి వ్యవసాయాన్ని పండుగ చేసింది. రైతుకు అండగా నిలిచేందుకు ఖర్చుకు వెనుకాడకుండా తీసుకున్న నిర్ణయాలు.. అమలు చేసిన పథకాలు ఊహించని ప్రగతికి కారణమయ్యాయి.
సీఎం కేసీఆర్ నిర్ణయాలతో:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముందుగా రైతులకు కావాల్సిన సాగునీరు..వ్యవసాయ విద్యుత్ పైన చర్యలు ప్రారంభించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఇందుకోసం ఏటా రూ.5 వేల కోట్లు భరిస్తున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.36,889 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది.

ఇది కాకుండా రూ.38 వేల కోట్లతో విద్యుత్తు సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్స్, వైర్‌లైన్ల మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణం వంటి ఆధునీకరణ పనులను చేపట్టింది. మొత్తం విద్యుత్తులో 40 శాతం వ్యవసాయ రంగానికే అందిస్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 8.17 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 27.20 లక్షలు ఉన్నాయి.
ప్రతీ అడుగు పక్కాగా:మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాుఅలోకి రావటంతో సాగు విస్తీర్ణం అమాంతం రెట్టింపయ్యింది. 2014-15లో యాసంగి, వానాకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదనంగా ఏటా 15-20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏడేండ్ల కాలంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా విలువైన సంపద పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 40.74 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం రూ.17,351 కోట్ల భారాన్ని భరించింది. మిగిలిన రుణాల మాఫీకి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 10.92 లక్షల మంది రైతుల రూ.94 వేల వరకు గల రుణాలను మాఫీ చేయనుంది.
దేశం చూపు తెలంగాణ వైపు:ఎకరాకు రూ.10 వేలు చొప్పున 65 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 2018 వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు 10 సీజన్లలో ఏకంగా రూ.65,192 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు భీమా పధకం ద్వారా ఏ కారణం చేతైనా రైతు మరణిస్తే రైతుకుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నారు.
దీనికి బీమా పాలసీ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. ఇలా నాలుగేండ్లలో 1,00,782 రైతు కుటుంబాలకు రూ.5,039 కోట్లు పరిహారంగా చెల్లించింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా విలువైన సంపద పెరగటం గమనార్హం. 2014-15లో పంటలు, పశు సంపద, చేపల నుంచి వచ్చిన ఆదాయం రూ.73,658 కోట్లు మాత్రమే. ఇందులో పంటల వల్ల వచ్చిన ఆదాయం రూ.41,706 కోట్లు. అదే 2020-21లో వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం రూ.1.80 లక్షల కోట్లు. ఇటువంటి ఫలితాలతో దేశం మొత్తం తెలంగాణ రైతు వైపు చూసేలా ప్రభుత్వ నిర్ణయాలు దోహదం చేసాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications