వ్యూహం మార్చిన పవన్, బీజేపీ నేత మంత్రాంగం..!!
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు హోరా హోరీగా మారాయి. జనసేన అభ్యర్ధులు బరిలో నిలిచారు. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం కోసం పవన్ సమాయత్తం అయ్యారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు పవన్ తో భేటీ అయ్యారు. కీలక చర్చలు జరిగాయి. పవన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇదే సమయంలో జనసేన అభ్యర్దు లు మాత్రం పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు బీజేపీలో చర్చగా మారాయి. అసలు ఇంతకీ పవన్ వ్యూహం ఏంటి.. ఏం జరుగుతోంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్య నేతలు ప్రచార బరిలోకి దిగారు. ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన నిర్ణయాలు ఆసక్తి కరంగా మారాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ బీజేపీ పోటీలో ఉండగా.. తన పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపటం కొత్త చర్చగా మారింది. తమ పార్టీ అభ్యర్ధుల తరపున పవన్ తొలుత ప్రచారానికి సిద్దమయ్యారు. బీజేపీ ముఖ్య నేతలు వెంటనే పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్‌ను కోరారు. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారు. అయితే అనూహ్యంగా పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆసక్తిగా మారింది. అయితే, జనసేన అభ్యర్ధులు మాత్రం బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 336 వార్డుల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

బీజేపీ నేతల చర్చలతో
పవన్ చివరి నిమిషంలో తన ప్రచారం రద్దు చేసుకోవటం వెనుక కొత్త కారణాలు తెర మీదకు వస్తున్నాయి. తన పార్టీ అభ్యర్ధులు బరిలో ఉన్న సమయంలో బీజేపీ సైతం పోటీ చేస్తుండటం.. ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూ... ఈ రెండు పార్టీలు పోటీ పడటం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. అయితే, ప్రచారానికి దూరంగా ఉండటం ద్వారా కొత్త చర్చలకు ఆస్కారం ఇవ్వకూడదనేది పవన్ ఆలోచనగా విశ్లేషణలు ఉన్నాయి. అయితే, జనసేన మొత్తం 336 వార్డుల్లో పోటీ చేస్తుంది. నిజామాబాద్ - 48, కొత్తగూడెం - 22, రంగారెడ్డి - 21, ఖమ్మం - 17, వరంగల్ - 20, నల్గొండ - 46, మహబూబ్‌నగర్ - 44, మహబూబాబాద్ - 5, మెదక్ - 18, కరీంనగర్ - 56, ఆదిలాబాద్ - 39 వార్డుల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలోని జన సైనికులు, వీరమహిళలు ఉత్సాహంగా పాల్గొని, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications