కాళ్లు చేతులు కట్టేసి చంపి శవాన్ని తగులబెట్టారు: విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా శివారులో బొమ్మకల్ రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. కాళ్లు, చేతులు కట్టేసి దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీసులు కాలిన మృతదేహాన్ని గుర్తించారు. ఎక్కడో చంపేసి తీసుకువచ్చి ఇక్కడ తుగలబెట్టారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుటే, హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌లో ఫిజియోథెరపీ విద్యార్థి విజయకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి విజయ్‌కుమార్‌ నిమ్స్‌లోలని ఆరో అంతస్థులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ఆరంభించారు.

Person killed in Karimnagar district

కుంటలో పడి ఇద్దరి మృతి

నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బోజ్యా తండాలో గుగులోతు సిద్ధు (6), బాణోత్‌ ఆనంద్‌కుమార్‌(6) కుంటలో పడి మృతిచెందారు. ఎల్‌కేజీ చదువుతున్న వీరు ఆదివారం తండా పక్కనే ఉన్న కుంటలో ఆడుకోవడానికి వెళ్లి దుర్మరణం చెందారు.

కల్తీకల్లు తాగి మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూర్‌ మండలం గుడెబల్లూర్‌కు చెందిన ప్రెగడబండ కుర్వ పెద్ద సాయిబన్న(45) కల్తీ కల్లు తాగి శనివారం మృతి చెందాడు. గొర్రెలు కాస్తూ మురహర్‌దొడ్డికి వెళ్లి కల్తీ కల్లు తాగి దుకాణం వద్దే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+