పోలీసులే దొంగలుగా: మేత కోసం వచ్చిన మేకలను అమ్ముకున్న పోలీసులు
హైదరాబాద్: ఎవరేమనుకుంటే మాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది కొందరి పోలీసుల వ్వవహార శైలి. ఖాకీలకే చెడ్డ పేరు తెచ్చేలా ఉందీ వార్త. అయినా సరే వారి తీరు మాత్రం మారడం లేదు. పోలీసుల వృత్తికే మచ్చ తెచ్చేలా సిగ్గుమాలిన ఘటన ఒకటి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణ పురం పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలుగా మారారు. మేత కోసం వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన మేకలను ఎత్తుకెళ్లి రూ. 20 వేలకు అమ్ముకున్నారు.

పోలీసుల నిర్వాకంతో కంగుతిన్న మేకల యజమాని వేర్ గత్యంతరం లేక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీసులే మేకలు అమ్ముకున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన ప్రజలు మేకలను దొంగతనం చేసే వీళ్లా మనకు రక్షణ కల్పించేది? అని నవ్వుకుంటున్నారు.












Click it and Unblock the Notifications