వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్లక్ష్యం వల్లే ఖైదీల పరారీ: జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహా

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ సెంట్రల్‌ జైలులో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించడం వల్లే ఇద్దరు ఖైదీలు పారిపోయారని రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ ఆకుల నర్సింహా తెలిపారు. ఖైదీలు పరారైన అంశంపై వివరాలు వెల్లడించేందుకు గురువారం జిల్లా కేంద్ర కారాగారంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నర్సింహ మ్లాడుతూ.. నవంబర్ 12న వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుంచి సైనిక్‌ సింక, రాజేశ్‌ యాదవ్‌ అనే ఇద్దరు కరుడుగ్టిన నేరస్తుల పరారీ ఘటన, ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కొంత మంది అధికారుల తప్పిదం వల్లే జరిగిందన్నారు. ఇదే విషయం తమ విచారణలో వెల్లడైందన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై త్వరలోనే శాఖాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు.

కట్టుదిట్టమైన భద్రగా ఏర్పాట్లు కలిగిన వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడం అంత సులువుకాదని, ఖైదీలు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఐీ నర్సింహ అభిప్రాయపడ్డారు. ఇటువిం పరిస్థితులు పునరావృతం కాకుండా చూసేందుకు జైళ్లశాఖ కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుందన్నారు.

prisoners escaped because of staff carelessness

కరెంట్ షాక్‌కు గురికాకుండా రగ్గు...

పరారైన ఖైదీ సైనిక్‌ సింగ్‌ ఎలక్ట్రీషియన్‌ కావడంతో అతడి సలహామేరకు.. రగ్గు సహాయంతో కర్‌ెం షాక్‌కు గురికాకుండా ముగ్గురు తప్పించుకునే ప్రయత్నం చేశారని ఐజీ నర్సింహ తెలిపారు. ఇద్దరు పారిపోగా మరో ఖైదీ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిపారు. ఈ ఘనటతో చితవేరు రాజశేఖర్‌ భయానికిలోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఇప్పుడను బాగానే ఉన్నాడనన్నారు.

తాళం ముట్టుకుంటే సైన్‌ మోగేలా ఏర్పాట్లు

జైలులో 150 సీసీ కెమెరాలు, హైమాస్‌ లైట్లు, ఎలక్ట్రానిక్‌ కంప్యూటరైజ్డ్‌ తాళాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు నర్సింహ వివరించారు.

మరో 100 పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటు

జైళ్లశాఖ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరో 100 పెట్రోల్‌, డీజిల్‌ బంకులను ఏర్పాటు చేస్తామని నర్సింహ వెల్లడించారు. వీటి ద్వారా రూ. 130 కోట్ల వార్షికాదాయం వస్తోందన్నారు. ఇవి జీతభత్యాలకు సరిపోతున్నాయన్నారు. సమావేశంలో వరంగల్‌ సెంట్రల్‌ జైలు సూపరింటెండెండ్‌ మందారపు సంపత్‌ పాల్గొన్నారు.

English summary
prisoners escaped because of staff carelessness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X