బీజేపీ, టీఆర్ఎస్‌ రెండూ మా శత్రువులే: కేసీఆర్ దుష్టాలన అంటూ రాహుల్ నిప్పులు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండో రోజు ముగిసంది. గురువారం 26 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలతోపాటు వేలాది మంది కార్యకర్తలు ఉత్సాహంగా నడిచారు. విద్వేషం చోడో.. భారత్ జోడో నినాదాలతో యాత్ర మార్మోగింది. కాగా, ఎలిగండ్లలో రాహుల్ ఈ రాత్రి బస చేయనున్నారు. శుక్రవారం ఎలిగండ్ల క్యాంప్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలంటూ రాహుల్


పాదయాత్ర ముగిసిన అనంతరం నారాయణ్‌పేట్ జిల్లా ధన్వాడ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భిన్నంగా సాగిది రాహుల్ ప్రసంగం. అవినీతి టీఆర్ఎస్, మతతత్వ బీజేపీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. తెలంగాణలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఇదే ఉత్సాహంతో కాశ్మీర్ వరకు ఉంటుందన్నారు. దేశంలో హింస, ద్వేషం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్వచ్ఛమైన వాతావరణంలో దేశ నిర్మాణం అవసరం. అందుకే జోడో యాత్ర చేపట్టానని రాహుల్ తెలిపారు.

దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దుష్టపాలనంటూ రాహుల్

దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దుష్ట పాలన సాగిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఏ బిల్లు పెట్టినా బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అన్నదాతల కోసం అనేక బిల్లు తెచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, టీఆర్ఎస్ సమ దూరంలో ఉన్నాయని స్పష్టం చేశారు. అవి రెండూ కాంగ్రెస్‌కు శత్రువులేనని అన్నారు. నాణేనికి బొమ్మ బొరుసు మాదిరే టీఆరెస్, బీజేపీ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటూ డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పార్టీలని అన్నారు. అడ్డగోలుగా ఎమ్మెల్యేలు కొనుగోలు తో నవ్వులపాలు చేస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దే: రాహుల్

దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దేనని రాహుల్ అన్నారు.
'15 వేల కోట్ల మియపూర్ భూముల కుంభకోణంలో ఎలాంటి విచారణ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో విచ్చలవిడి అవినీతి. రాష్ట్రంలో రైతులు మాట్లాడి స్వయంగా వారి సమస్యలు తెలుసుకుంటున్నా. టీఆరెస్ బీజేపీ రాజకీయ పార్టీలు కాకుండా వ్యాపార సంస్థలుగా ఉన్నాయి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేశాయి అని రాహుల్ విమర్శించారు.

తెలంగాణ ప్రజలిచ్చిన ఉత్సాహంతోనే యాత్ర: రాహుల్

నిరుద్యోగ సమస్య పెరుగుతూ తారాస్థాయికి చేరింది. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల చిన్న మధ్య తరహా వారి మీద ప్రభావం. యవత్ దేశం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రోజు రోజుకు నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల. పెట్రోల్ గ్యాస్ ధరలు పెరుగుదలకు మోడీ ఎం సమాధానం చెబుతారు అని రాహుల్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాటిని ఎలుగెత్తి చాటాడానికే జోడో యాత్ర. మీ అభిమానం ప్రేమ తోనే నడుస్తున్నా. ఇది సాధారణ యాత్ర కాదు మీరిచ్చిన ఉత్సాహంతోనే కాశ్మీర్ వరకు నడుస్తా అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ తోపాటు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+