హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం..!!

హైదరాబాద్‌ పరిధిలో మరో దారుణం చేసుకుంది. ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచార యత్నం కలకలంగా మారింది. సికింద్రాబాద్-మేడ్చల్‌ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయా లయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించడంతో తప్పిం చుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్​లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్​గా పని చేస్తున్న ఓ యువతి (23) ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్​కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్​లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ కు చేరుకుంది.

Rape Attempt on young women in MMTS train Police registered case

ఆ యువతి తన సెల్​ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ కు వచ్చింది. ఎంఎంటీఎస్​ లో మేడ్చల్ కు మహిళల కోచ్ ​లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలో ప్రయాణిస్తు న్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని అల్వాల్ రైల్వే స్టేషన్​లో దిగిపోయారు. అనంతరం ఆ కోచ్​లో ఆమె ఒక్కరే మిగిలిపోయారు. ఇది గమనించిన ఓ యువకుడు (25) ఆమె వద్దకు వచ్చి అత్యాచా రయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువతి నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది.

కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కింద పడి, గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వటం తో ప్రథమ చికిత్స అందించి ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వద్ద నుంచి స్టేట్​మెంట్​ రికార్డు చేసిన పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+