పక్కా ప్రణాళికతో కాల్పులు
హైదరాబాద్: నగరంలోని ఒక స్థలం కబ్జా విషయంలో తమకు అడు తగిలాడని ప్రత్యర్థిపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ బాపూ నగర్ కు చెందిన నాగేందర్ రెడ్డి, పద్మానగర్ కు చెందిన చక్రవర్తి మంచి స్నేహితులు.. వీరివురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో విడిపోయారు. విడిపోయినా.. ఒకరి పై ఒకరికి మాత్రం కక్ష మాత్రం తగ్గలేదు. ఒకరి వ్యాపార లావాదేవీలను.. మరొకరు ఓ కంట కనిపెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో చక్రవర్తి కన్ను చెన్నైలో నివాసముంటున్న ఒకరి స్థలంపై పడింది. దీంతో పద్మానగర్ ఫేజ్-02లోని సర్వే నెంబరు 102 లోని 800 గజాల స్థలాన్ని చక్రవర్తి, అతని అనుచరుడు కేదారి ప్రభు దేవ్ కబ్జా చేశారు. దీన్ని గమనించిన నాగేందర్ రెడ్డి చెన్నైలో నివాసముంటున్న ఆస్థల యజమాని నర్సింహారావుకు సమాచారం అందించడంతో ఆయన 2015 డిసెంబర్ లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అనంతరం చక్రవర్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేందర్ రెడ్డి పై కక్ష పెంచుకున్న చక్రవర్తి అతడిని ఎలాగైనా అంతమొందించేందుకు రంగం సిద్దం చేశాడు. ఈ క్రమంలో నింధితులు 16వ తేది రాత్రి నాగేందర్ రెడ్డి పై తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.












Click it and Unblock the Notifications