అసెంబ్లీ సమావేశాలు పెంచండి: రేవంత్ రెడ్డి
అసెంబ్లీ ఎక్కువ రోజులు జరిపాలని ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీని కొద్దిరోజులే నడిపి ఏదో ఒక సాకుతో నిరవధిక వాయిదా వేయడం ఆనవాయితీగా మారిందని, అలాంటి పద్ధతిని మానుకొని అసెంబ్లీని కనీసం 20 రోజులైనా నడపాలన్నారు. సోమవారం టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సారి సమావేశాలను కనీసం 20 రోజులపాటు నిర్వహించాలని అన్నారు. ఈ నెల 16నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications