కేసీఆర్! ఈ డిమాండ్‌లు తీర్చండి: రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై దృష్టిసారించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ లేఖ రాశారు. రైతు పోరుబాటలో రైతుల సమస్యలు తెలుసుకున్నానని, రుణమాఫీ వడ్డీలకే సరిపోతోందని లేఖలో పేర్కొన్నారు.

ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజాబాబాద్ జిల్లాల్లో నకిలీ విత్తనాల వల్ల రైతులు పంట నష్టపోయారన్నారు. వారికి ఎకరాకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం హామీ అమలు కావడం లేదని తెలిపారు.
కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో విత్తనాలు, ఎరువుల కోసం.. రైతులు అవస్థలు పడుతున్నారని, రైతులను ఆదుకునే మార్గాలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి లేఖలో సూచించారు.












Click it and Unblock the Notifications