స్వార్థం వల్లే ఉప ఎన్నిక, రాజధాని డబ్బుతో బాబు ప్రచారం: వరంగల్‌లో రోజా రోడ్‌షో

వరంగల్: వరంగల్ ఉప ఎన్నిక ప్రజలు కోరుకున్నది కాదని, కొందరి స్వార్థ వల్లే ఉప ఎన్నిక జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వరంగల్‌ లోకసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్నఅభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున ఆమె సోమవారం ప్రచారం చేస్తున్నారు.

ఇందులో భాగంగా రఘునాథపల్లె, స్టేషన్ ఘనపూర్, జాఫర్ గడ్, వర్ధన్నపేటలలో నిర్వహించిన రోడ్ షోలలో పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. మాటల మాంత్రికుడు, ఏపీ సీఎం చంద్రబాబు నోటు ఉంటే ఓటు వస్తుందని భావిస్తున్నారని ఆమె విమర్శించారు.

Roja compaign in Warangal district

ఏపి రాజధాని పేరుతో దోచుకున్న డబ్బుతో వరంగల్‌లో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధివచ్చేలా వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోజా ఓటర్లను అభ్యర్థించారు.

ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న రైతు వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పినివ్వాలని కోరారు. ఈ రోడ్‌షోలలో రోజాతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు రాష్ర్ట, జిల్లా నాయకులు పాల్గొన్నారు. శాయంపేట పరిధిలో పార్టీ కార్యకర్తలు ప్రచార వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+