కోర్టుకు తీసుకెళ్తుంటే భద్రతా సమస్య: ఇక జైల్లోనే భత్కల్ విచారణ
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌ను ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపరిచే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యాసిన్ భత్కల్‌ను చర్లపల్లి జైలులోనే విచారించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం న్యాయమూర్తి, మల్కాజిగిరి డిసిపి, పీపీలు ఇవాళ చర్లపల్లి జైలులో కోర్టును పరీక్షించారు.

ఇక నుండి వచ్చే వాయిదాలలో భత్కల్‌ను జైలులోనే విచారించాలని నిర్ణయించారు. ఈ రోజు (గురువారం) భత్కల్‌ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జైలు నుంచి ఎల్బీ నగర్ కోర్టుకు తరలించే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications