బాలికపై రేప్, ఏడేళ్ల జైలు శిక్ష: గుడిలో చోరీకి వచ్చి పట్టుబడ్డాడు

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి నాగార్జున తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం గుంటి జంగయ్యనగర్‌ కాలనీలో నివసించే బుచ్చయ్య 2014 ఫిబ్రవరిలో ఇంటిపక్కన ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు.

బాలిక తమ్ముడు శ్రీను ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదుచేసి నిందితున్ని అరెస్టుచేసి కోర్టులో హాజరు పరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి బాధ్యునికి ఏడు సంవత్సరాలు జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఇదిలావుంటే, హైదరాబాద్‌ నగర శివారు నార్సింగి పోలీసుస్టేషను పరిధిలోని హైదర్‌షాకోటలోని రామాలయంలో ఓ దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. స్థానికులు దొంగను పోలీసులకు అప్పగించారు. పోలీసులు దొంగను ప్రశ్నిస్తున్నారు.

మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఎల్లప్ప (30) శుక్రవారం అర్థరాత్రి సీతారాముల ఆలయంలోని హుండీని పగులగొట్టి అందులోని సొమ్ముతో పాటు ఆలయంలోని ఇతర సామగ్రిని మూట కట్టుకుని పారిపోయేయ ప్రయత్నం చేశాడు. హుండీ పగులగొట్టి చప్పుడు కావడంతో సమీపంలోని వాళ్లు గుడి వద్దకు వచ్చారు.

Seven yeras imrisonment in rape case in Rangareddy district

ఇది గమనించిన దొంగ ఆలయం వెనక భాగంలో ఉన్న స్టోర్‌రూంలో దాక్కున్నాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కాగా, ఎల్లప్ప గతంలో కూడా పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని మాధవరెడ్డి వంతెన సమీపంలో జరిగింది. కాలనీకి చెందిన శ్రీధర్ (43) అర్థిక సమస్యలు ఎదురు కావడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+