ప్రేమే కారణమా? ప్రధాని బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ ఆత్మహత్య

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లలో ఉన్న ఓ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లలో ఉన్న ఓ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీధర్ అనే ఈ ఎస్ఐ తన సర్వీసు రివాల్వర్‌తో గుండెకు గురి పెట్టి కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌ 174వ నెంబర్ పిల్లర్ వద్ద ఉప్పరపల్లి సమీపంలో చోటు చేసుకుంది.

ఎస్ఐ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం ఓ హోంగార్డుతో మాట్లాడిన శ్రీధర్.. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. వద్దని వారించి తాను వెళ్లిపోయానని హోంగార్డ్ దీపక్ తెలిపారు. ఆ తర్వాత శనివారం ఉదయం ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని, వచ్చి చూసేసరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.

ప్రేమ వ్యవహారమే

ఆదిలాబాద్: ఆత్మహత్మకు పాల్పడిన ఎస్ఐ శ్రీధర్ కేసు విషయంలో శనివారం ఏసీపీ గంగారెడ్డి పలు విషయాలను మీడియాకు తెలిపారు. శ్రీధర్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంభంలో కొన్ని చిన్నచిన్న సమస్యలు వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

ఆత్మహత్యకు చేసుకున్నరోజువరకూ శ్రీధర్ రెండు రోజులుపాటు నైట్ డ్యూటీలో ఉన్నాడు, ఆయనతో పాటు హోమ్ గార్డ్ దీపక్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నారన్నారు. రాత్రి 11 గంటల సమయంలో సర్వీస్ రివాల్వర్ తో శ్రీధర్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని గంగారెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్స్ తో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.

Photos : ప్రధాని రాక కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు

ప్రధాని బందోబస్తు కోసం వచ్చి..

ప్రధాని బందోబస్తు కోసం వచ్చి..

2012 బ్యాచ్‌కు చెందిన శ్రీధర్.. కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన ప్రధాని భద్రత కోసం హైదరాబాద్ వచ్చారు.

సమీపంలోనే..

సమీపంలోనే..

ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతమంతా భద్రత కట్టుదిట్టంగా ఉంది. పైగా ఉప్పరపల్లి అంటే ప్రధానిబస చేస్తున్న పోలీసు అకాడమీకి చాలా దగ్గరగా ఉంటుంది.

ఆత్మహత్యతో కలకలం

ఆత్మహత్యతో కలకలం

శనివారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పోలీసులు భారీగా మోహరించారు. ఘటన జరిగిన అనంతరం శ్రీధర్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు సమాచారం.

కారణం తెలియరాలేదు

కారణం తెలియరాలేదు

కాగా, శ్రీధర్ స్వస్థలం వరంగల్. గతంలో కాగజ్‌నగర్ రూరల్ ఎస్ఐగా పని చేశారు శ్రీధర్. 2 నెలల క్రితమే చింతలమానేపల్లి ఎస్ఐగా విధుల్లో చేరారు. కాగా, కుటుంబ కలహాల కారణంగానే శ్రీధర్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణం మాత్రం తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+