కెసిఆర్ మాట నిలబెట్టాడు: నాయిని ప్రశంసలు, ప్రజల ఘనతేనన్న హరీశ్(పిక్చర్స్)
మెదక్: సిద్దిపేట, సిరిసిల్ల నియోజక వర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా ‘చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట' పేరిట శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు.
శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు హరీశ్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు ఈ ఘనత సాధించిపెట్టడంలో అధికారులు ప్రజల సమష్టి కృషి ఉందన్నారు.
కేవలం 15 రోజుల వ్యవధిలోనే 5,531 మరుగుదొడ్లను నిర్మించడం దానికి ఉదాహరణగా చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 64 మున్సిపాలిటీల్లో సిద్దిపేట నూటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నుల వసూలు సాధించిన ఘనత దక్కించుకుందన్నారు.ఇంకుడు గుంతల నిర్మాణంలో రాష్ట్రానికే ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలిచిందన్నారు.
సిఎం కెసిఆర్ జూలై మాసంలో ఏక కాలంలో 5,500 మొక్కలు నాటితే ఆ మొక్కలన్ని పచ్చగా ఏపుగా పెరిగి సిద్దిపేట పట్టణానికే పచ్చనిశోభను తీసుకువచ్చాయన్నారు. ఇప్పటి వరకు నియోజక వర్గంలో 40 లక్షల మొక్కలు నాటి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. ఈ విజయోత్సవ స్పూర్తితో మరిన్ని స్పూర్తిదాయకమైన కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం మొదలుకుని నేటి బంగారు తెలంగాణ నిర్మాణం వరకు చరిత్రను సృష్టించినా, దాన్ని తిరగరాసినా సిద్దిపేట ప్రజలకే సాధ్యమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కితాబునిచ్చారు.

చరిత్ర పుటల్లో చంద్రబాబు
సిద్దిపేట, సిరిసిల్ల నియోజక వర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

చరిత్ర పుటల్లో చంద్రబాబు
సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా ‘చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట' పేరిట శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు.

చరిత్ర పుటల్లో చంద్రబాబు
శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు హరీశ్‌రావు అధ్యక్షత వహించారు.

చరిత్ర పుటల్లో చంద్రబాబు
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు ఈ ఘనత సాధించిపెట్టడంలో అధికారులు ప్రజల సమష్టి కృషి ఉందన్నారు.

చరిత్ర పుటల్లో చంద్రబాబు
కేవలం 15 రోజుల వ్యవధిలోనే 5,531 మరుగుదొడ్లను నిర్మించడం దానికి ఉదాహరణగా చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 64 మున్సిపాలిటీల్లో సిద్దిపేట నూటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నుల వసూలు సాధించిన ఘనత దక్కించుకుందన్నారు.
మరుగున పడిన తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ గాడిలోపెట్టిన కెసిఆర్‌కు నియోజకవర్గ ప్రజలు వెన్నంటి ఉన్నారని, తెలుగుదేశం నేతలు గోనె సంచుల్లో డబ్బులు పంచినా ఆశపడకుండా ఉద్యమానికి మద్దతు పలకడం సిద్దిపేట వాసులకే చెల్లిందన్నారు.
నాటి ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ సాధన వరకు సిద్దిపేట ప్రజలు చరిత్రలు సృష్టించి తిరగరాస్తున్నారన్నారు. పిల్లనిచ్చి కాళ్లు కడిగిన మామను చంద్రబాబునాయుడు మోసం చేస్తే, నియోజకవర్గాన్ని అప్పగించిన మామ కెసిఆర్ మాటను నిలబెట్టడంలో మంత్రి హరీశ్‌రావు విజయవంతమయ్యాడని అభినందించారు.
తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని, భవిషత్‌లో దేశానికే స్ఫూర్తి నిస్తుందని భరోసా వ్యక్తం చేసారు. సిద్దిపేటకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజల యొక్క కమిటిమెంట్ చూస్తే తనకు ఈర్ష్య కలుగుతోందని, ఇలాంటి ఐక్యత ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications