Monsoon: షాకింగ్ వార్త చెప్పిన స్కైమెట్.. అప్పటి వరకు వర్షాలు ఉండవటా..!
నైరుతి రుతుపవనాలు దేశాన్ని తాకినా.. ఇంకా తెలంగాణలోకి ప్రవేశించలేదు. నైరుతి రుతుపవనాలపై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ బాంబు పేల్చింది. దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రభావం నాలుగు వారాల వరకు అంతగా ఉండదని తెలిపింది. ఈసారి వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయంపై అధాపడే రైతులకు కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేసింది.
స్కైమెట్ అంచనా ప్రకారం జూలై 6 వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంది. వర్షాధర పంటైన వరి పంట వేసినవారికి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఆలస్యంగా ప్రవేశించాయని తెలిపిన స్కైమెట్.. అవి మందకొండిగా చలిస్తున్నట్లు వివరించింది. మధ్య, పశ్చిమ భారత్ ప్రాంతాల్లోని రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొవచ్చని పేర్కొంది.

సాధారణంగా జూన్1 న రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళను తాకాయని చెప్పిన స్కైమెట్.. గుజరాత్ తీరంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ వల్ల రుతుపవనాలు లేట్ గా వచ్చినట్లు తెలిపింది. రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా లేవని.. మందకొండిగా కదులుతున్నాయని వివరించింది. రుతుపనాలు నెమ్మదిగా కదిలితే.. మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, బిహార్ లో జూన్ 15 వరకు కూడా నైరుతి చేరుకోవడం కష్టమని తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు వస్తే రుతుపవనాల్లో వేగం పెరగొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్పా బయటకు రావొద్దని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications