సోషల్ మీడియా! భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి యువకుడితో జంప్!!
సోషల్ మీడియా మంచి కోసం వాడుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. కానీ, సరదా కోసం, అనవసర పరిచయాల కోసం అర్రులు చాస్తే జీవితాలు నాశనం అవుతాయి. సోషల్ మీడియా పరిచయాలు ఎంత ప్రమాదకరమో ఇటీవల పలు ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ, చాలా మంది మాత్రం సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా, ఓ మహిళ కట్టుకున్న భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి.. సోషల్ మీడియా పరిచయమైన యువకుడితో పరారైంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడుకు చెందిన గోపి (22) కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. నరగంలోని కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్ ఉంటూ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ కు చెందిన సుకన్య (35)కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త.. స్నేహం, ప్రేమగా మారింది. వీరిద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకునేవారు. సుకన్యకు అప్పటికే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా, గోపి లేకుండా ఉండలేనని భావించిన సుకన్య.. ప్రియుడు గోపితో పారియేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సుకన్య.. గోపితో కలిసి ఉంటోంది.
తన భర్య సుకన్య కనిపించకపోవడంతో భర్త జయరాజ్ ఆందోళనకు గురయ్యాడు. వెంనటే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా గోపితో సుకన్య వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జయరాత్ వారి కోసం తీవ్ర గాలింపు చేపట్టాడు. కాగా, ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్ పై వెళుతూ అతనికి గోపి, సుకన్య కనిపించారు. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు జయరాజ్.
భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025
మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్
తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన… pic.twitter.com/e0oDcb0593
అయితే, బైక్‌ను పక్కన పడేసిన సుకన్య, గోపి.. రన్నింగ్ బస్ ఎక్కి పారిపోయారు. మరోవైపు, జయరాజ్ ఫిర్యాదుతో పోలీసులు గోపి, సుకన్యల కోసం గాలింపు ఉధృతం చేశారు. ఇది ఇలావుండగా, తమ కొడుకును మాయ మాటలతో నమ్మించి సుకన్య తనతో తీసుకెళ్లిందంటూ గోపి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె బారినుంచి తమ కొడుకును కాపాడాలంటూ వేడుకుంటున్నారు.
-
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications