యోగేంద్ర యాదవ్, ఢిల్లీలో ఏఏపీ: టిలో కోదండ నేతృత్వంలో జాప్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది.
ఏఏపీ తరహాలో తెలంగాణలో జాయింట్ యాక్షన్ పార్టీ (జాప్) రావొచ్చునని పేర్కొంది. భావసారుప్య శక్తులను కలుపుకొని సంపూర్ణ తెలంగాణ సాధనకు కృషి చేసే అవకాశాలున్నాయని, జాప్‌కు కోదండరామ్ నాయకత్వం వహించవచ్చునని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని పేర్కొంది.
మరోసారి సకల జనులను ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. కోదండ నేతృత్వంలో కొత్త శక్తులు పురుడు పోసుకునే అవకాశాలున్నాయంటున్నారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో ముఖ్య కారకుల్లో ఒకరైన యోగేంద్ర యాదవ్ తెలంగాణలో కోదండతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ నెల 10వ తేదీన వీరిద్దరి మధ్య కీలక సమావేశం జరగనుందని విశ్వసనీయ వర్గాలు వివరించాయంది.
ఏఏపీ నుంచి బయటకు వచ్చాక యోగేంద్ర యాదవ్ స్వరాజ్ అభియాన్ అనే కొత్త వేదికను ప్రారంభించారు. దీని ద్వారా ఆయా రాష్ట్రాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై యోగేంద్ర దృష్టి పెట్టారని పేర్కొంది.
కోదండ, యోగేంద్ర పలుమార్లు భేటీ అయినట్లుగా తెలుస్తోందని పేర్కొంది. వారిద్దరి మధ్య సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గతంలోనే ఏఏపీకి తెలంగాణ కన్వీనర్‌గా ఉండాలని కోదండకు యోగేంద్ర ఆఫర్ చేశారని, దానిని ఆయన తిరస్కరించారని తెలుస్తోందని పేర్కొంది. అయితే, ప్రస్తుతం యోగేంద్ర, కోదండలు కలిసి పని చేసేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొంది.
సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం అన్న కోదండ వ్యాఖ్యల్లో అంతరార్థం ఉందని కూడా అంటున్నారంటున్నారు. ఆప్ తరహాలో తెలంగాణలో జాప్ పైన కోదండరామ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోందని పేర్కొంది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications