సెల్‌ఫోన్ తీశాడని నిందలు: భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: హైదరాబాదునగరంలోని ముషీరాబాద్‌లో బుధవారంనాడు విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్‌లో గల వాసవి ఆర్యవైశ్య వసతిగృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
వసతి గృహంలో మూడో అంతస్తుపై నుంచి దూకి సీఏ చదువుతున్న హరీశ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్‌ఫోన్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు ప్రాథమిక సమాచారం. హరీష్‌ది నిజామాబాద్ జిల్లా అని తెలుస్తోంది.
స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మ-తి
ఇదిలావుంటే, ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని అభిలాష్(4) అనే బాలుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని భీమిని మండలం జనకాపూర్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాలుడి మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన సంగ భూమేష్త, మౌనిక దంపతులు బతుకుదెరువు కోసం జనకాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. చిన్నవాడైన అభిలాష్ (4) ఇంటి వద్ద ఉంటున్నాడు.
బుధవారం సాయంత్రం ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన అతడిని భీమినీకి చెందిన ఓ స్కూల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అభిలాష్ అక్కడికక్కడే మరణించాడు.












Click it and Unblock the Notifications