మోడీ శవయాత్ర నిర్వహించిన సుధీర్ రెడ్డి
హైదరాబాద్: నోట్ల రద్దు పై కాంగ్రెస్ పార్టీ నగరంలోని ఎల్బీనగర్‌లో ఆందోళన నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్వర్యంలో కాంగెస్ కార్యకర్తలు, నాయకులు ప్రధాని మోడీ శవ యాత్రను నిర్వహించారు. ఈ శవయాత్ర నాగోల్ చౌరస్తా నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు సాగింది. ఈ శవయాత్రలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ శవ యాత్ర అనంతరం మోడీ ఫోటోకు అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications