బియాస్ ఘటన: హిమాచల్ ప్రభుత్వానికి సుప్రీం షాక్

2014లో బియాస్ నదిలో చోటుచేసుకొన్న ఘోర ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు మరణించారు.అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఘోర తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకొందని పరిహరం చెల్లించాలన

హైదరాబాద్: 2014లో బియాస్ నదిలో చోటుచేసుకొన్న ఘోర ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు మరణించారు.అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఘోర తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకొందని పరిహరం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అయితే ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్ళిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

2014 లో లో బియాస్ నదిలో హైద్రాబాద్ విజ్ఞాన జ్యోతి కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు విహరయాత్రకు వెళ్ళారు.అయితే ఈ నదిపై నిర్మించిన డ్యామ్ కింద విద్యార్థులు ఫోటోలు దిగుతున్నారు. అయితే ఎలాంటి హెచ్చరికలు లేకుండానే డ్యామ్ అధికారులు నీటిని కిందకు వదిలారు.

Supreme court dismisses Himachal Pradesh government petition on vignana jyothi students.

దీంతో ఫోటోలు దిగుతున్న విద్యార్థులు ఆకస్మాత్తుగా వరద నీరు పోటెత్తడంతో నీటిలో కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నీటిలో 24 మంది కొట్టుకొని చనిపోయారు. ఈ ఘటనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.

ప్రతి ఒక్క విద్యార్థికి రూ. 25 లక్షలను చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.అయితే ఈ విషయమై ఆరు మాసాల సమయం ఇవ్వాలని కోరింది ప్రభుత్వం. అయితే అదే సమయంలో ఈ ఘటనకు తమకు ఎలాంటి బాధ్యత లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.

అయితే హిమాచల్ ప్రదే్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ విషయమై బాధిత కుటుంబాలకు పరిహరం చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+