ఆ ట్రెండ్ కంటిన్యూ అయితే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ గ్యారెంటీ

హైదరాబాద్ లో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో- అన్ని రాజకీయ పార్టీలూ దీనిపై దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నాయి. ఈ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్, ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ రాష్ట్ర సమితి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ సైతం అభ్యర్థిని నిలబెట్టబోతోంది. నవంబర్ 11వ తేదీన ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగనుంది.

బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేసింది. సోమవారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

Sympathy Votes Often Fall Short Lessons from Telangana s By-Polls

తెలంగాణలో శాసనసభ్యుల మరణం తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో సానుభూతి పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించట్లేదు. సింపతీ ఓటుబ్యాంకు పని చేయట్లేదు. సానుభూతి ఓట్లు వారి కుటుంబ సభ్యులకు ఆశించిన స్థాయిలో లభించడం లేదు. 2014 తర్వాత జరిగిన అయిదు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది కూడా. అయిదుసార్లు ఉప ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఓటమి పాలయ్యారు. నాలుగుసార్లు అధికార పార్టీనే గెలిచింది.

  • 2016లో పాలేరు ఉప ఎన్నిక- సిట్టింగ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూయడంతో ఆయన భార్య సుచరిత రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ 45,000లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
  • అదే ఏడాది నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నిక- కాంగ్రెస్ పార్టీకే చెందిన పీ కిష్టారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు సంజీవరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అధికార బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున ఎం భూపాల్ రెడ్డి 53,000కు పైగా మెజారిటీ సాధించారు.
  • 2020లో దుబ్బాక ఉప ఎన్నిక- బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య సోలిపేట సుజాతరెడ్డి పోటీ చేసి పరాజయాన్ని చవి చూశారు. అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. బీజేపీ తరఫున బరిలో దిగిన రఘునందన్ రావు విజయఢంకా మోగించారిక్కడ.
  • 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక- సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూయడంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్.. బీఆర్ఎస్ తరఫున పోటీ విజయం సాధించారు. కాంగ్రెస్ కు సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని ఆయన ఓడించారిక్కడ. కుటుంబ సభ్యుడు గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం ఇదొక్కటే.
  • 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక- బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణానంతరం ఉప ఎన్నిక జరిగిందిక్కడ. ఆమె సోదరి జీ నివేదిక సాయన్న పోటీ చేసి ఓడిపోయారు. ఏకంగా మూడోస్థానానికి పడిపోయారు. అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు.
  • 2025లో జూబ్లీహిల్స్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యను బీఆర్ఎస్ ఇక్కడ బరిలో దించింది. అదే ట్రెండ్ కొనసాగితే అధికార పార్టీ ఇక్కడ గెలవడం ఖాయం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+