ఆ సమయంలో ఎండలో నిలుచుకున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై కోర్టుకు?

తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య శాసనసభ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య శాసనసభ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో సభ నుంచి బహిష్కరణకు గురైన వీరు బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సమయంలో ఎండలోనే నిలబడి తమ నిరసన తెలిపారు.

బడ్జెట్ ప్రసంగం గంటకు పైగా సాగింది. సభ నుంచి సస్పెండ్‌ చేసే అధికారం స్పీకర్‌కు లేనప్పటికీ తాము గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నామనే నెపంతో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో తమ గొంతు నొక్కడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

TDP MLA Revanth Reddy stands in sun

ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట నిరసన తెలపాలని టిడిపి నిర్ణయించింది. ఖమ్మంలో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణతో పాటు రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

ఇదిలా ఉండగా, గురువారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి సస్పెన్షన్‌ అంశాన్ని ఆయనకు వివరించాలని నిర్ణయించారు. మరోవైపు, తమ సస్పెన్షన్ పైన రేవంత్ రెడ్డి, సండ్రలు హైకోర్టుకు వెళ్లే విషయమై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+