నాలుగేళ్ల కేసీఆర్ పాలన-విశ్వాసంతో ముందుకు: ఏం చేశామంటే.. సీఎంవో ఏం చెబుతోందంటే?
Recommended Video

హైదరాబాద్: దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణను నాశనం చేశారని, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు పదేపదే చెబుతున్నారు. అయితే ఇన్నేళ్లుగా తెలంగాణకు నాటి పాలకులు ఏం చేయలేకపోయారని, కానీ తాము నాలుగేళ్లలో ఎన్నో సాధించామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకల వార్తలు చదవండి
నాలుగేళ్ల తెలంగాణ పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. వాటికి టీఆర్ఎస్ నేతలు ఎప్పటికి అప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ కూడా స్పందిస్తున్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, నాలుగేళ్ల పాలనలోనే ఎన్నో సాధించామని చెబుతున్నారు.
కేసీఆర్ నాలుగేళ్ళ పాలన
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంవో కార్యాలయం నాలుగేళ్లలో సాధించిన అంశాలు, పథకాలతో కూడిన అంశాలను ట్వీట్ చేసింది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ట్వీట్ చేసింది. మైనార్టీలకు, ఆయా వర్గాలకు, మహిళలకు, రైతులకు ఇలా అన్ని వర్గాలకు తమ పాలనలో చేసిన అంశాలను క్లుప్తంగా పొందుపర్చారు.
విద్యుత్ లోటు మొదలు షీ టీమ్స్ వరకు
తెలంగాణను ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకు వెళ్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. కేసీఆర్ కాలం సంక్షేమ పథకాలకు స్వర్ణయుగమన్నారు. విద్యుత్ లోటు నుంచి విద్యుత్ ఆదా, కళ్యణ లక్ష్మి లేదా షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం, కొత్త పాస్ బుక్స్, మిషన్ భగీరథ, రైతు సమన్వయ సమితులు, టీఎస్ ఐపాస్, షీ టీమ్స్ తదితర రంగాల్లో ఏం సాధించామే క్లుప్తంగా పేర్కొన్నారు.
ప్రపంచానికే స్ఫూర్తిదాయకం
ప్రగతి పథంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సదా ఆచరణీయం, దేశానికే కాక ప్రపంచానికే స్ఫూర్తిదాయకం! అని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానం
దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రం... అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొంటున్నారు. రైతన్నకు ప్రోత్సాహం, సంప్రదాయ వృత్తులకు జవసత్వాలు, రైతన్నలకు రూ.5 లక్షల బీమా, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు, చేనేత కార్మికులకు తోడ్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కేసీఆర్ పథకాలకు ప్రశంసలు
కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ఒక్కో ఏడాది ఏం పథకాలు తీసుకు వచ్చారో తెరాస చెబుతోంది. సాగు, తాగు నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లా, డబుల్ బెడ్రూం, షాదీ ముబారక్, షీ టీమ్స్, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలతో పాటు రైతుల కోసం తీసుకు వచ్చిన రైతు బంధు పథకం అందరినీ ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని పలువురు డిమాండ్ చేసిన సందర్భం కూడా ఉంది. కేంద్రమంత్రులు కూడా పలుమార్లు కేసీఆర్ పాలనను, పథకాలను మెచ్చుకున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications