నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు, 4 ఫ్లస్ 4 గన్ మెన్స్, మంత్రుల మాదిరిగా..
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిన్న సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి.. జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత ఏర్పాటు చేశారు. ఆ వీడియోలు బయటకు రావడంతో వారి ప్రాణాలకు థ్రెట్ ఉందని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డికు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచించి. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలకు కొనసాగుతున్న భద్రతకు అదనంగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది.

నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రుల స్థాయి భద్రత కల్పించనుంది. నలుగురికీ 4 ప్లస్ 4 గన్‌మెన్లను కేటాయించింది. హైదరాబాద్‌లోని నివాసంతోపాటు సొంత నియోజకవర్గంలో భద్రత కల్పిస్తారు. దీంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
నిన్న కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా లెజిస్లేచర్, కార్యనిర్వహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, నాలుగోది మీడియా అని వివరించారు. వీటన్నింటిని పక్కన పెట్టేశారు. ఎవరినైనా బెదిరించగలం, ఏమైనా చేయగలం అని వారు అనుకుంటున్నారు. ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి. ఎవరు కూడా ఊహించలేరని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల అభివృద్దికి ఆటంకంగా మారారని తెలిపారు. ప్రధాని మోడీకి తెలిసి జరుగుతుందో తెలియదు కానీ.. నివారించాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications